Wedding video Viral : వైరల్: అందరూ చూస్తుండగా భార్యతో డ్యాన్స్ చేయాలనుకుని, బొక్కబోర్లా పడ్డాడు చూడండి!

పెళ్లి ఫంక్షన్లలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉత్సాహం రెట్టింపవుతుంది.ఉత్సాహం ఊరకలేస్తుంటే పెద్దలు కూడా చిన్న పిల్లల వలె డ్యాన్సులు వేస్తూ అందరి చేత ఈలలు కొట్టించుకుంటున్నారు.

 He Wanted To Dance With His Wife While Everyone Was Watching And He Fell-TeluguStop.com

అయితే ఒక్కోసారి వీరు చేసే డ్యాన్స్ బెడిసికొట్టడంతో నవ్వులు పాలవుతుంటారు.తాజాగా ఒక భర్త కూడా ఇప్పుడు నలుగురిలో నవ్వుల పాలయ్యాడు.

ఇతడు తన భార్యని ఎత్తుకొని హీరో లాగా డ్యాన్స్ చేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలనుకున్నాడు.కానీ అందులో అతడు విఫలం కావడంతో అందరూ నవ్వేశారు.

దాంతో అతడి మొహం చిన్నబోయింది.ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి స్టైల్ గా భార్యతో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు.ఆ తర్వాత అతడు అందరి ముందు షో చేద్దాం అనుకున్నాడు.

అందుకు బొద్దుగా ఉన్న తన భార్యను ఎత్తాలని అనుకున్నాడు.తన భార్యని ఎత్తుకొని గుండ్రంగా తిప్పి హీరో లాగా డ్యాన్స్ ఇరగదీయాలని అనుకున్నాడు.

మరో ఆలోచన లేకుండా అతడు తన భార్యను ఎత్తుకున్నాడు.అయితే ఆమెను తన మోకాళ్ల వరకు ఎత్తుకోగానే బ్యాలెన్స్ ఆగలేదు.

నిజానికి అతడు సరైన పోజులో నిల్చోని ఆమెను ఎత్తలేదు.ఫలితంగా అతడు ఆమెను కాస్త పైకి ఎత్తగానే బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు.

అతడు మాత్రమే కాదు భార్యను కూడా కింద పడేశాడు.

పెళ్లికొచ్చిన అతిథుల కళ్ళంతా వీళ్లపైనే ఉన్నాయి.పైగా వారు డ్యాన్స్ చేసేది స్టేజ్ పైన! కింద పడగానే అందరూ ఘల్లున నవ్వగానే అతడు తన పరువు అంతా గంగలో కలిసిపోయిందని ఫీలవుతున్నట్టు ముఖం ఎత్తుకోలేకపోయాడు.భార్య కూడా ముఖం దాచుకుంటూ చాలా ఇబ్బంది పడిపోయింది.

అందుకే అందరి ముందు హీరో స్టైల్ లో ఫోజులు చేయకూడదని ఈ వీడియో షేర్ చేసిన యూజర్ ఫన్నీగా ఒక క్యాప్షన్ జోడించారు.ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube