శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.జిల్లాకు చెందిన టీడీపీ నేత సవితమ్మ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు.
ఇప్పటికే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.సవితమ్మకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
రైల్వే కాంట్రాక్టు పనుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాడులు నిర్వహిస్తోంది.సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే.