గూగుల్ మ్యాప్స్ వాడేవారికి స్ట్రీట్ వ్యూ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది.నిజానికి ఈ ఫీచర్ ఒక్కటే స్పెషల్‌గా గల స్టాండ్ అలోన్ అప్లికేషన్‌ను కూడా గూగుల్ తీసుకొచ్చింది.
స్ట్రీట్ వ్యూ యాప్‌గా పిలిచే ఈ యాప్ యూజర్లకు 360-డిగ్రీస్‌లో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.కొత్త ప్రదేశాలు, తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈ యాప్ సేవలు ఎంతగానో హెల్ప్ అవుతాయి.
అయితే ఈ ఫీచర్ ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్‌లో ఉంది కాబట్టి దీని కోసం ఎవరు కూడా సపరేట్ యాప్ వాడటం లేదు.దీనివల్ల దానికోసం వాడుతున్న రిసోర్సెస్ అనేవి వృథాగా మారుతున్నాయి.
అందుకే గూగుల్ దీనిని క్లోజ్ చేసి మిగిలిన రిసోర్సెస్ తో గూగుల్ మ్యాప్స్ లో ఉన్న స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఇంప్రూవ్ చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి 31 నుంచి ఈ యాప్ సేవలను శాశ్వతంగా నిలిపివేయనుంది.
ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ ఈ స్ట్రీట్ వ్యూ యాప్ రిలీజ్ అయింది.దీని ద్వారా వివిధ టూరిస్ట్ ప్లేసులు, రెస్టారెంట్ల ఫొటోలను పోస్ట్/అప్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా గూగుల్ మొదటగా ఆండ్రాయిడ్ యూజర్లకు దీని సేవలను బంద్ చేసే అవకాశం ఉంది.ఒక టెక్ రిపోర్ట్ ప్రకారం, ఇప్పటికే గూగుల్ తన ఆండ్రాయిడ్ స్ట్రీట్ వ్యూ యాప్ యూజర్లకు ఒక నోటీస్ పంపుతోంది.
ఆ నోటీసు ప్రకారం వచ్చే ఏడాది నుంచి గూగుల్ స్ట్రీట్ వ్యూ యాప్ సేవలు నిలిచిపోతాయి.ఈ యాప్ అందించే సేవలను పొందేందుకు వినియోగదారులను గూగుల్ స్ట్రీట్ వ్యూ స్టూడియో లేదా గూగుల్ మ్యాప్స్ కి తరలి వెళ్లాలని ఆ సంస్థ సూచిస్తోంది.

మన భారతదేశంలో ఈ యాప్ సేవలో అందుబాటులోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు.సెక్యూరిటీ క్లియరెన్స్ కారణంగా ఈ యాప్ మన ఇండియాలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది.కాగా ఇప్పుడు దీన్ని సేవలు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది నెలల్లో ఈ యాప్ శాశ్వతంగా క్లోజ్ అవుతుంది కాబట్టి దీని ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని వాడటం మంచిది.