పావలా శ్యామల.లేట్ వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అనేక విచిత్రమైన వివాదాల్లో నానుతుంది.1984 లో ఛాలెంజ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన పావలా శ్యామల చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడింది.ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన శ్యామల చిన్నతనం లోనే తల్లిని కోల్పోయింది.
ఇక తాను పెరిగి పెద్దయి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కాగానే భర్త చనిపోయాడు.బ్రాహ్మణ కుటుంబలో జన్మించిన శ్యామల మరొక వివాహం చేసుకోకుండా తన కూతురిని చూసుకుంటూ సినిమాల్లో నటిస్తూ కాలం వెళ్లదీసింది.
అయితే ఆమె కూతురికి కాళ్ళు లేకపోవడం ఇప్పుడు ఆమెకు ఉన్న అతి పెద్ద సమస్య.
సినిమాల్లో నటిస్తున్నంత కాలం ఆమెకు ఏ లోటు లేకపోయినా వచ్చిన డబ్బంతా కూడా కూతురి వైద్యం కోసం ఉపయోగించింది.
అయితే శ్యామలకు సైతం వయోభారం తో సినిమాలు తగ్గాయి.చిన్న చితక సినిమాల్లో నటిస్తూ వచ్చిన 2019 నుంచి ఆమె పూర్తిగా సినిమాలు మానేసింది.
ఇక అదే సమయంలో ఆమె కూతురికి టిబి కూడా అటాక్ అవ్వడం తో ఉన్న కాసింత డబ్బు కూడా కరిగిపోయింది.దాతల సహాయం కోసం మీడియాలో అర్ధించింది.
పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలను పంపించాడు.కేసీఆర్ సైతం 20000 ఇచ్చాడు.
మా అసోసియేషన్ నుంచి నెలకు 10 వేలు మంజూరు పెన్షన్ మంజూరయ్యింది.
కానీ వచ్చే డబ్బు కేవలం శ్యామలకు మరియు ఆమె కూతురు వైద్యానికి కూడా సరిపోవడం లేదు అంటూ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ లు ఇచ్చిది.ఇక్కడే వచ్చింది అసలు తలనొప్పి.శ్యామల బ్రాహ్మణా కుటుంబంలో జన్మించడం తో ఎవరు ఏం ఇచ్చిన తీసుకోదు.
కేవలం డబ్బు మాత్రం ఇవ్వండి అంటూ కండిషన్స్ పెడుతుంది.ఎవరయినా దాతలు ముందుకు వచ్చి పప్పులు, పళ్ళు ఇస్తే తిరిగి వారికే ఇచ్చేస్తుంది.
తీసుకోవడానికి ససేమీరా అంటూ మొహం మీదే చెప్తూ దాతలను ఇబ్బందికి గురి చేస్తుంది.ఇలాంటి పరిస్థితి కరాటే కళ్యాణి కి కుడా ఎదురయ్యింది.పావలా శ్యామాల తో మీడియా ముఖంగా గొడవకు దిగింది.ఒక వైపు సహాయం కావలి అంటుంది మరో వైపు నాకు నచ్చిందే ఇవ్వాలని అంటుంది.అందుకే ఆమెకు సహాయం చేయడానికి చాల మంది ముందుకు రావడం లేదు.ఇక ఇప్పుడు ఒక ఆశ్రమం లో తన కూతురితో సహా ఉంటుంది.