టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రైతు కోసం తెలుగుదేశం పాదయాత్రలో పాల్గొన్న ఆమె జగన్ పై మండిపడ్డారు.
జగన్ బటన్ సీఎం అయ్యాడు అని విమర్శలు చేశారు.అయితే బటన్ నొక్కిన గాని రైతులకు డబ్బులు పడటం లేదు.
ఇదే సమయంలో పంట పొలాలకు కరెంటు బిల్లులు ప్రభుత్వం కట్టకపోవడంతో కాలువలకు నీళ్లు ఇవ్వటం లేదు.ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు మరియు డీజిల్ రేట్లు బాగా పెంచడం జరిగింది.
అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడ్డారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా రైతుల తరఫున కచ్చితంగా పాదయాత్ర చేస్తాం.
పాలన పూర్తిగా గాడి తప్పింది.మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
రైతుల తరపున వినతిపత్రం ఇవ్వటానికి వస్తే తహసిల్దార్ కార్యాలయంలో ఎవరు ఉండరు.తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుల భూములను ఆన్ లైన్ లో మార్పులు చేసి వైసీపీకి చెందిన వారి పేర్లను ఎక్కిస్తున్నారు అంటూ పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.