ఒక సినిమా తీయాలంటే తలకు మించిన భారం.ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్న లేదంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఇక అంతే సంగతులు.
వారి ఇగోలతో ఆ షూటింగ్ లొకేషన్ ని రచ్చ రచ్చ చేస్తారు.ఒకరికి ఏదైనా తగ్గితే చాలు ఇక యుద్ధం మొదలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.
మరి అలంటి ఒక ఇన్సిడెంట్ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య జరిగిందట.ఇంతకి ఆ హీరోయిన్స్ ఎవరు ? ఆ గొడవ ఏంటి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.90’s లో రంభ మరియు సిమ్రాన్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగారు.ఇందులో రంభ కాస్త సీనియర్ హీరోయిన్ అనే చెప్పాలి.
సిమ్రాన్ కంటే ఒక ఐదారేళ్లు రంభ ముందుగానే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.
అయితే సిమ్రాన్ మరియు రంభ కలిసి ఒక సినిమా కోసం పని చేసారు.
ప్రభు దేవా, అబ్బాస్ హీరోలుగా నడిచిన వి ఐ పి సినిమాలో రంభ మరియు సిమ్రాన్ హీరోయిన్స్ గా నటించారు.ఇక్కడ మొదలయ్యింది అస్సలు రచ్చ.
సిమ్రాన్ కి ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం.ఇక రంభ మాత్రం కొంచం సీనియర్ కావడం తో కాస్త ఆటిట్యూడ్ తో ఉండేది.
కానీ ముంబై అమ్మాయి కావడం తో సిమ్రాన్ కూడా తానేమి తక్కువ తినలేదు అన్నట్టుగా బెహేవ్ చేసేది.
దాంతో ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అనేలా గొడవలు మొదలయ్యాయి అంటూ అప్పట్లో తమిళ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.
ఇద్దరికి కొన్ని సీన్స్ విషయంలో కూడా ప్రాధాన్యత తగ్గింది అంటూ ఒకరంటే మరొకరు ఏడ మొహం పెడా మొహం గా ఉండేవారట.ఇక రొమాంటిక్ కామెడీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇద్దరు హీరోయిన్స్ కి మంచి పేరు కూడా వచ్చింది.ఈ సినిమా తర్వాత ఒక ఇంటర్వ్యూ లో సిమ్రాన్ వారి మధ్య జరిగిన గొడవ గురించి బయట పెట్టింది.
అది అంత ముగిసిపోయిన గతం అని తాము మంచి మిత్రులం అంటూ షాకిచ్చింది.ఆ తర్వాత కొన్నాళ్లకే రంభ మెల్లిగా సినిమాలు తగ్గించిన సిమ్రాన్ మాత్రం సూపర్ క్రేజ్ తో దూసుకుపోయింది.