వాట్సాప్ తన వినియోగదారులకు షాకిచ్చింది.తాజాగా దేశంలోని 26.85 లక్షలకు పైగా ఖాతాలను సస్పండ్ చేసింది.కాగా వీటిలో 8.72 లక్షల ఖాతాలు ఎలాంటి రిపోర్టులు రాకముందే నిషేధించడం కొసమెరుపు.అంతకుముందు ఆగస్టులో వాట్సాప్ 23.28 లక్షల ఖాతాలపై నిషేధం విధించిన సంగతి విదితమే.ఇకపోతే సెప్టెంబర్‌లో నిషేధిత ఖాతాల సంఖ్య ఆగస్టుతో పోలిస్తే 15% ఎక్కువ అని చెప్పుకోవాలి.
వీటిలో 8,72,000 ఖాతాలు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే బ్లాక్ చేయబడటం కొసమెరుపు.
లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని.
విషయం ఏమంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.ఈ సందర్బంగా వాట్సాప్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.“IT రూల్స్ 2021 ప్రకారం.సెప్టెంబర్ 2022 నెల నివేదికను తాజాగా ప్రకటించాము.
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు వలన, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యల వివరాలు.ఇక్కడ పొందుపరచాము.
అలాగే మా ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి తాజా చర్యలు తీసుకోక తప్పలేదు” అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే అప్‌గ్రేడ్ ఐటి రూల్స్ 2021 ప్రకారం.5 మిలియన్లు అంటే 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ప్రధాన డిజిటల్ మరియు సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి నెలవారీ సమ్మతి నివేదికను ప్రచురించాలి.ఈ క్రమంలోనే అక్టోబర్ 28న ప్రభుత్వం సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను నోటిఫై చేసినట్టు భోగట్టా.
సోషల్ మీడియా వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం నియమించిన అప్పీలేట్ కమిటీని 3 నెలల్లో ఏర్పాటు చేయనున్నారు.నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి నెలా వాటి సమ్మతి నివేదికలను విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.