ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకోనున్న ఆయన 11 వ తేదీన ఏడు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
ఈనెల 12న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు.







