కోలీవుడ్ సెలబ్రిటీ జంట మహాలక్ష్మి,రవీందర్ గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఈ జంట పెళ్లి సమయంలో వీరిపై ఎన్నో రకాల విమర్శలు నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.అంతేకాకుండా పెళ్లి తర్వాత ఈ జంట పేర్లు కోలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా వీరి పేర్లు మారుమోగిపోయాయి.
అయితే వారిపై నెగటివ్ గా కామెంట్ చేసే వారికి తమదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది మహాలక్ష్మి.కాగా వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
అంతేకాకుండా వీరిద్దరికి కూడా ఇది రెండవ వివాహం కావడం విశేషం.అయితే పెళ్లి తర్వాత ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
రవీందర్ పెళ్లి తర్వాత మహాలక్ష్మి కోసం ఏకంగా ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు తయారు చేసినట్లుగా వార్తలు వినిపించాయి.దాంతో నెటిజెన్స్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఇది ఇలా ఉంటే తాజాగా తన భార్య మహాలక్ష్మికి రవీందర్ మరో ఖరీదైన గిఫ్ట్ ని ఇచ్చినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు దీపావళి నీతోనే కాబట్టి మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని ఆశ ఉంది.
మహాలక్ష్మి ఐ లవ్ యు మై మాన్ అనే రాసుకుంది.రవీందర్ కూడా నాకు ప్రియమైన వారిని చూడటానికి నాకు ప్రతిరోజు దీపావళి సంతోషంగా ఉండు అంటూ ట్వీట్ చేశాడు.ఇది ఇలా ఉంటే తాజాగా రవీందర్ తన భార్య కోసం కొత్త లగ్జరీ కార్ ని కొనుగోలు చేశాడు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ కార్ ని కొనుగోలు చేశారు రవీందర్.ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా తాజాగా ఈ జంట కొనుగోలు చేసిన ఆ కారు ధర 32 లక్షలు అని తెలుస్తోంది.