జమ్మూ కశ్మీర్‌లో దాగి ఉన్న స్వర్గం లాంటి ప్లేస్.. చూస్తే ఫిదా!

చాలామంది ప్రజలు ప్రకృతి అందాలను చూసేందుకు ఇతర దేశాలకు వెళ్తుంటారు.అయితే భారతీయులు మాత్రం వేరే దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

 Tarsar Marsar Trek On Of The Beautiful Places In Jammu And Kashmir Detals, Tarsa-TeluguStop.com

ఎందుకంటే మనదేశంలో ఉత్తరాఖండ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, జైపూర్ వంటి చాలా రాష్ట్రాల్లో కూడా ప్రకృతి, మానవ నిర్మిత అందాలకు నెలవైన ఎన్నో ప్రదేశాలున్నాయి.ఇక జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉండే టార్సర్ సరస్సును చూస్తే ఎవరైనా సరే మైమరిచి పోవాల్సిందే.

అలానే పుల్వామా జిల్లాలో కొండలు మధ్యలో సరస్సులు, పచ్చని చెట్లు చూస్తుంటే భూతల స్వర్గంలో ఉన్నంత అనుభూతి కలుగుతుంది.

ట్రాకింగ్ చేసే వారికి టార్సర్ ఉత్తమమైన ప్రదేశమని చెప్పొచ్చు.

మీరు మంచుతో నిండిన బ్లూ కలర్ సరస్సుల పక్కనే క్యాంప్‌కు వెళ్తే మరో స్థాయిలో అనుభూతి పొందవచ్చు.చాలా ఏకాంతంగా టార్సర్ లేక్ ప్రదేశం బెస్ట్ క్యాంప్‌సైట్‌గా కూడా అభివర్ణించొచ్చు.

ఇదే ప్రదేశంలో టార్సర్ సరస్సుకు కొద్ది దూరంలో మార్సార్ సరస్సు కూడా ఉంటుంది.ఇది ఎల్లప్పుడూ మేఘాల ముసుగులో దాగి ఉంటుంది.

ఓవర్‌హాంగ్ నుంచి ఈ సరస్సు అందాలను వీక్షించవచ్చు.దాని పైన సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూస్తే మనసు పులకరించిపోతుంది.

మేఘాల బొమ్మలు యూ ఆకారపు లోయ గుండా వెళ్లి సరస్సు పైన స్థిరపడే వరకు సూర్యోదయం జరుగుతుంది.

Telugu Beautifuljammu, Beautiful Trek, Jammu Kashmir, Marsar, Tarsar Lake, Tarsa

సరస్సు కొన్ని సెకన్లలో కనిపించకుండా పోతుంది.టార్సర్ సరస్సు వరకు ట్రెక్కింగ్ చేసేవారికి మంచి ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది.టార్సార్ మార్సర్ ట్రెక్ మిమ్మల్ని కాశ్మీర్ నడిబొడ్డుకు తీసుకువెళుతుంది.

అరు అనే విచిత్రమైన గ్రామం నుంచి లిద్దర్వాట్ క్లియరింగ్స్ వరకు, షెఖావాస్‌లోని పచ్చని పర్వతాల నుంచి భారీ ఆల్పైన్ సరస్సుల వరకు చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో కనిపిస్తాయి.టార్సర్ మార్సర్ ట్రెక్ ప్రకృతికి దగ్గరగా ఉంటూ అడ్వెంచర్స్ ఫన్ అందిస్తుంది.

ఈ ప్రదేశం చూడాలనుకునే వారు బస్సు లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube