ఫుడ్ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటో కస్టమర్లపై ఎంతలా ఛార్జీలు వడ్డిస్తున్నాయో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.అటు కస్టమర్ల నుంచి ఛార్జీలు, ఇటు రెస్టారెంట్ల నుంచి కమీషన్లు లాగేయడంలో ఈ ఫుడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ ముందుంటున్నాయి.
ఈ కంపెనీలు డిస్కౌంట్స్ అంటూ తగ్గిస్తున్న ఫుడ్ ప్రైస్‌ల వల్ల కూడా పార్ట్‌నర్డ్ రెస్టారెంట్లకు నష్టాలే మిగిలుతున్నాయి.యాప్ ద్వారా చేసే డైన్-ఇన్ ఆర్డర్‌లపై కూడా డిస్కౌంట్‌లు ఇవ్వాలని స్విగ్గీ ఇటీవల రెస్టారెంట్లను బాగా బలవంతం చేస్తోంది.
డైన్-ఇన్ అంటే హోటల్/రెస్టారెంట్‌కు వెళ్లి తినడం అన్నమాట.ఇక్కడ కూడా డిస్కౌంట్స్ ఇవ్వాలని స్విగ్గీ రెస్టారెంట్లపై ఒత్తిడి తెస్తోంది.
కాగా ఈ విషయంలో రెస్టారెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.తమ సొంత రెస్టారెంట్‌లో సొంతంగా తయారు చేసే ఫుడ్ ధరలు తాము కాకుండా స్విగ్గీ కంపెనీ ఇష్టారాజ్యంగా ప్రైసులు తగ్గించడం ఏ మాత్రం బాగోలేదని ఇవి ఆ సహనం వ్యక్తం చేస్తున్నాయి.
అలానే ఇంకో కారణం వల్ల స్విగ్గీ నుంచి సుమారు 900 రెస్టారెంట్లు తమ డైనౌట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నాయి.స్విగ్గీలోని డైన్-ఇన్ ఫీచర్లకు దూరంగా ఉండాలని రెస్టారెంట్లను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరడంతో.
ఒకేసారి 900 రెస్టారెంట్లు ముందడుగు వేశాయి.

ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కేఫ్ ఢిల్లీ హైట్స్, స్మోక్ హౌస్ డెలి, సోషల్, ది బీర్ కేఫ్, మమగోటోతో సహా పలు హై-ఎండ్ కేఫ్‌లు, రెస్టారెంట్లు స్విగ్గీ డైనౌట్ నుంచి తమను తాము తొలగించుకున్నాయి.ఇండిగో హాస్పిటాలిటీ, ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్, హాస్పిటాలిటీ, సిమ్మరింగ్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్లు కూడా ప్లాట్‌ఫామ్ నుంచి తమను తాము డీ-రిజిస్టర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది.ఇక డైన్‌అవుట్ డీప్ డిస్కౌంట్ పద్ధతులు కూడా రెస్టారెంట్‌ల ప్రధాన డైన్-ఇన్ వ్యాపారానికి అంతరాయం కలిగిస్తాయని.
ప్రమాదకరమైన డిస్కౌంట్ సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కారణం అవుతాయని రెస్టారెంట్ అసోసియేషన్ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.కాగా తాజాగా ఈ విషయంపై స్విగ్గీ స్పందించింది.కొన్ని రెస్టారెంట్లు మాత్రమే డీలిస్ట్ అయ్యాయని.స్విగ్గీ డైన్‌అవుట్‌లో లిస్ట్ అయ్యే రెస్టారెంట్లకు యాప్‌లో ఎంత డిస్కౌంట్ ఇవ్వాలనే స్వేచ్ఛ పూర్తిస్థాయిలో ఉంటుందని స్విగ్గీ వెల్లడించింది.