కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో యాత్ర” ఎల్లుండి నుండి తిరిగి స్టార్ట్ కానుంది.ఇటీవల దీపావళి పండుగ నేపథ్యంలో మూడు రోజులపాటు రాహుల్ విరామం తీసుకున్నారు.
ఆదివారం యాత్ర తెలంగాణలో ప్రవేశించాక.పండుగ సందర్భంగా గ్యాప్ తీసుకోవడం జరిగింది.
అయితే పండుగ అయిపోవడంతో రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని.రాత్రికి నారాయణపేట్ జిల్లా మక్తల్ చేరుకోనున్నారు.
ఆ తర్వాత ఎల్లుండి నుండి నవంబర్ 7 వరకు తెలంగాణలో పాదయాత్ర కొనసాగుతుంది.
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలతో వాడి వేడిగా ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సంచలనంగా మారనుంది.కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ చేస్తున్న ఈ పాదయాత్రలో ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభిస్తూ ఉండటం విశేషం.
మరోపక్క కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే రేపు బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు.ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ సమక్షంలో ఖర్గే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.