డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల బిడ్డపై జరిగిన ఘటనపై సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.పసి బిడ్డపై జరిగిన ఘటన తనను కలిచివేసిందని తెలిపారు.
త్వరగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.నిందితులకు శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు చూడాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అదేవిధంగా అన్ని విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యత అని గుర్తు చేశారు.