ట్విట్టర్ టిల్లు అంటూ ' బండి ' వెటకారం ! కేటీఆర్ వీడియో ప్రజలకు చూపిస్తూ... ?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేశారు.కేటీఆర్ గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బేరీజు వేస్తూ ప్రజల్లో కేటీఆర్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా బండి సంజయ్ విమర్శలు చేశారు.

 Bandi Sanjay Sensational Commsnts On Ktr, Ktr ,telangana Bjp President , Bandi S-TeluguStop.com

ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా పార్టీల మధ్య జరుగుతోంది.ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల రాజకీయ విన్యాసాలతో రాజకీయ నాయకులు రంగంలోకి దిగిపోయారు.

ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపిస్తూ.పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా కేటీఆర్ పై బండి సంజయ్ వ్యంగ్య విమర్శలతో విరుచుకుపడ్డారు.చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోది కి లేఖ రాయడంపై బండి ఘాటుగా స్పందించారు.
 

Telugu Bandi Sanjay, Kcrmunugodu, Telangana Bjp, Telangana, Trs-Political

అసలు చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించాలంటూ ప్రధానిని కోరింది కేటీఆర్ నే అంటూ సంజయ్ విమర్శించారు.అంతేకాకుండా అప్పట్లో కేటీఆర్ మాట్లాడిన మాటల వీడియోను ప్రజలకు చూపిస్తూ , దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో అంటూ నిలదీశారు.ఇదిగో ట్విట్టర్ టిల్లు ! దీనికి ఏమి సమాధానం చెప్తావ్ అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.జిఎస్టి సమావేశం జరిగినప్పుడు ఐదు శాతం జీఎస్టీ వేయాలంటూ కేంద్రాన్ని కోరింది నువ్వే కదా అంటూ కేటీఆర్ పై సంజయ్ విమర్శలు చేశారు.

జీఎస్టీ సమావేశంలో  చేనేతపై పన్నులు రద్దు చేయాలని చెప్పకుండా ఏం పీకావ్ అంటూ సంజయ్ మండిపడ్డారు.చేనేత వస్త్రాలకు అద్దె రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని సంజయ్ నిలదీశారు.

కనీసం బతుకమ్మ చీరలను నేసే అవకాశం కూడా చేనేత కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలని కేటీఆర్ ను నిలదీశారు.చేనేత వస్త్రాలకు అద్దె రంగుల పై 50% సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు దానిని అమలు చేయలేదో చెప్పాలని సంజయ్ నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube