సాధారణంగా యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇవ్వాలంటేనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు.కొందరైతే లాభాలేమీ రావడంలేదని ఉద్యోగులకు ఎలాంటి బోనస్‌లు కూడా ఇవ్వరు.
అలాంటిది తాజాగా ఒక యజమాని దీపావళి పండుగ సందర్భంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 10 కార్లు, 20 బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు.ఇందుకోసం ఆయన రూ.1.2 కోట్లు ఖర్చు చేశారు.వివరాల్లోకి వెళితే.చెన్నైలోని ప్రముఖ వ్యాపారవేత్త జయంతి లాల్ ఛాయంతి చల్లని జ్యువెలరీ మార్ట్ నడుపుతున్నారు.కాగా ఆయన తన కంపెనీలో పని చేస్తున్న వారికి స్పెషల్ దీపావళి కానుకలను అందజేశారు.
ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడంతో ఆ ఉద్యోగుల్లో కొందరు ఆశ్చర్యపోతే.
మరికొందరు ఆనందభాష్పాలు జలజలా కార్చేశారు.జయంతి లాల్ మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యుల లాంటి వారిని.
వారిచ్చే సపోర్టు వెలకట్టలేనిది అన్నారు.ఆ ఉద్యోగులే తనకు లాభాలు ఆర్జించి పెట్టారని పేర్కొన్నారు.
ప్రతి యజమానికి కూడా వారి సిబ్బందికి బహుమతులు ఇచ్చి వారిని గౌరవించాల్సిన కనీస బాధ్యత ఉందని అన్నారు.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ యజమాని జయంతి లాల్ తన ఉద్యోగులకు బహుమతులు అందజేసే ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.ఆ ఫొటోలు కాస్త వైరల్ గా మారాయి.చాలామంది వ్యాపారవేత్త జయంతి లాల్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు.అదే ఐటీ కంపెనీలైతే ఉద్యోగులకు చిన్న డ్రైఫ్రూట్ బాక్స్ ఇచ్చి వెల్లగొడుతున్నాయని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.“ఉద్యోగులకు ఇలా బహుమతులు ఇచ్చి చాలా గొప్ప పని చేశార”ని అతన్ని నెటిజన్లు పొగుడుతున్నారు.