కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.పార్టీ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టి.
వారి మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సూచించారు.ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డిని కోవర్టురెడ్డి అనడం బాధాకరమని అన్నారు.ఆయన మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి రాకపోవడం వలనే ఇలాంటి విమర్శలు వచ్చాయని తెలిపారు.
క్యాంపెయిన్ లో పాల్గొనకపోతే వెంకట్ రెడ్డికి చెడ్డపేరు వస్తుందన్నారు.ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ప్రచారంలో పాల్గొనాలని వీహెచ్ సూచించారు.