కెనడా : ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్ధులకు గుడ్ న్యూస్...!!

అవసరం ఎలాంటి పనులైనా చేయిస్తుంద, ఎలాంటి రూల్స్ నైనా బ్రేక్ చేసేలా చేస్తుంది.ప్రస్తుతం కెనడా కి ఉన్న కార్మికుల కొరత రీత్యా కొన్ని నిభంధనలను సడలించక తప్పడం లేదు.

 Canada Allows Foreign Students To Work Off-campus For More Hours Indian Students-TeluguStop.com

కెనడాలో విపరీతంగా పెరిగిపోతున్న కార్మిక కొరత కారణంగా ఎన్నో సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రవాస కార్మికుల కోసం, నిపుణుల కోసం తమ వీసా నియమ నిభందనలలో మార్పులు చేస్తూ విదేశీయులకు ఆహ్వానం అందిస్తున్నాయి.

కాగా తాజాగా విదేశీ విద్యార్ధుల విషయంలో కూడా కెనడా చర్యలు చేపట్టింది.


గతంలో అత్యధిక శాతం మంది విదేశీ విద్యార్ధులు అమెరికా వైపు ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు, కానీ వారిని తమ దేశంలోకి ఆకర్షించడానికి విద్యార్ధి వీసా లో సమూలమైన మార్పులు చేస్తూ చదువు పూర్తైన తరువాత కూడా విద్యార్ధులు రెండేళ్ళ పాటు ఉద్యోగం వచ్చే వరకూ ఇక్కడ ఉండవచ్చునని, అలాగే ఉద్యోగం వచ్చిన ఐదేళ్ళ లో వారికి శాశ్వత నివాస హోదా కల్పిస్తామని ప్రకటించడంతో విదేశీ విద్యార్ధులు, ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు క్యూ కట్టారు.ఇదిలాఉంటే తాజాగా

Telugu Canada, Indian-Telugu NRI

విదేశీ విద్యార్ధుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కెనడా.గతంలో విద్యార్ధులు కెనడాలో చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవాలంటే తాము ఉండే క్యాంపస్ ను దాటి వారానికి 20 గంటలు కంటే ఎక్కువ పనిచేయ కూడదనే నిభందన ఉంది.కానీ ఈ నిభందనను సవరిస్తూ ఇకపై పని గంటలపై పరిమితి లేదని ప్రకటించింది.నవంబర్ 15 నుంచీ 2023 డిసెంబర్ 31 వరకూ ఈ సడలింపు వర్తిస్తుందని తెలిపింది.

ప్రస్తుతం కెనడాలో కార్మికుల కంటే కూడా ఉపాది అవకాశాల సంఖ్య ఎక్కువగా ఉందని దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కెనడా ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube