మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి కేటీఆర్.ఒక కాంట్రాక్టర్ బలుపు, అహంకారం వలనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు నల్గొండ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని తెలిపారు.వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.
కోవర్టు రెడ్డిలు అంటూ విమర్శలు గుప్పించారు.ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తప్పు చేయని వాళ్లు ఎవరికీ భయపడరని కేటీఆర్ స్పష్టం చేశారు.మోడీ అయినా ఈడీ అయినా ఎవరేం చేయలేరన్న ఆయన.చావనైనా చస్తాం కానీ భయపడేదే లేదని వెల్లడించారు.