సోలార్‌ హెడ్‌ల్యాంప్‌ వలన లాభాలు తెలిస్తే దానినే వాడుతారు తెలుసా?

సౌర విద్యుత్తు అంటే అందరికీ తెలిసిందే, సూర్యరశ్మి నుంచి తయారయ్యే విద్యుచ్ఛక్తి అని.విద్యుత్ అవసరాలకోసం మొదట్లో కేవలం ఫోటోవోల్టాయిక్స్ నే వాడేవారు.

 Do You Know The Benefits Of Solar Headlamp ,solar Head Lamp, Lucybeam, Benefits,-TeluguStop.com

అయితే ఇపుడు సోలార్ ప్యానెల్ అనేది చిన్న, మధ్య, పెద్ద తరహా అవసరాల కోసం కూడా వాడకం జరుగుతుంది.ఇందులో ఒకే ఒక సౌర ఘటంతో పనిచేసే క్యాలిక్యులేటర్ మొదలుకొని ఇంటి అవసరాలను తీర్చే సౌర ఫలకాల వరకు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.1980వ దశకం నుంచీ వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణం జరిగింది.

సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఖచ్చు తగ్గడంతో అనేకమంది వీటిని విరివిగా వాడటం మొదలు పెట్టారు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే ఫోటోవోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని ఉంది.ఇక్కడ ప్రతి ఏటా 2050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పన్నం అవుతుంది.

ఇక ఆ సంగతి పక్కనబెడితే నేడు హెడ్‌ల్యాంప్‌లు కూడా సౌరశక్తితో పనిచేసేవి మార్కెట్లోకి వచ్చేసాయి.హెడ్‌ల్యాంప్‌లు మనకి కొత్తగాని అమెరికన్స్ కి కాదు.

అవును అమెరికాకు చెందిన సంస్థ ఎంపవర్డ్‌ ‘లూసిబీమ్‌’ పేరుతో సౌరశక్తితో పనిచేసే LED హెడ్‌ల్యాంప్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఇది హెడ్‌ల్యాంప్‌గానే కాకుండా ఫ్లాష్‌లైట్‌గా కూడా ఉపయోగపడుతుంది.మనం ఎక్కడికన్నా బయటకి వెళ్ళినపుడు.ఉదాహరణకు చీకటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.చుట్టూ చీకటి ఉన్నా, దీని నుంచి వెలువడే వెలుతురులో హాయిగా నడవవచ్చు.అలాగే పుస్తకాలు చదువుకోవచ్చు.

దీని నుంచి 300 ల్యూమెన్స్‌ వెలుతురు నిరంతరాయంగా వెలువడుతుందని సమాచారం.కాగా మార్కెట్లో దీని ధర 35.68 డాలర్లు (రూ.2,920) మాత్రమే!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube