డ్రగ్ కింగ్ పిన్ ఎడ్విన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయకుండా న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఎడ్విన్ కోసం హైదరాబాద్ పోలీసులు గోవాలో గాలిస్తున్నారు.ఈ క్రమంలో ఎడ్విన్ నివాసానికి పోలీసులు వెళ్లగా తనకు కరోనా పాజిటివ్ ఉందంటూ అనుచరులతో ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాడు.
అయితే గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ఎడ్విన్.కర్రీస్ అనే పబ్ ను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిల్ వేశారు.మరోవైపు డ్రగ్ కింగ్ పిన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో స్టీవ్ ను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.