విజయవాడ, హెల్త్ యూనివర్సిటీకి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా పేరు మారింది.శాసనసభలో సీఎం జగన్ మాట్లాడుతూ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు పెడుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉండి ఉంటే బాగుండేదన్నారు.
ఎన్టీఆర్ అంటే కోపం లేదన్న సీఎం జగన్.చంద్రబాబు కంటే తనే ఎక్కువ గౌరవం ఇస్తానని అన్నారు.
గతంలో కూడా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదని.అంతో ఇంతో ఆయన మీద ప్రేమ తప్ప ఆయన్ను అగౌరవపరిచే కార్యక్రమం జరగదని చెప్పారు.
నందమూరి తారక రామారావు అనే పేరు మనం పలికితే చంద్రబాబుకు నచ్చదన్నారు.
చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే బహుశా ఇంకా చాలా కాలంపాటు బ్రతికుండే వారన్నారు.
ముఖ్యమంత్రిగా కూడా కచ్చితంగా రెండో దఫా పూర్తి చేసి ఉండేవారు.వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుపై.
బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.డాక్టర్ వైయస్సార్ అందరికీ చాలా బాగా తెలిసిన వ్యక్తి అని.ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వైయస్సార్ ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 వంటి పథకాలన్నింటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు.ఈనేపథ్యంలో వర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం సరైన నిర్ణయమే అన్నారు.