మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన సవాల్‌కు తాము సిద్ధమని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.మూడు రాజధానులపై రెఫరెండంకు సిద్ధమా అని మంత్రి సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సవాల్‌ను స్వీకరిస్తున్నామన్న అయ్యన్న.దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని వ్యాఖ్యనించారు.
మూడు రాజధానులే అంశంగా ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.
అదేవిధంగా అమరావతిలో టీడీపీ నేతలు భూములు దోచుకున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని భూములతో పాటు, విశాఖ భూములపై కూడా విచారణ జరిపించాలని సవాల్ చేశారు.దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని చెప్పారు.