మెగా ఫ్యామిలీతో కలవని అల్లు ఫ్యామిలీ.. రెండు ఫ్యామిలీలలో గొడవలు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న పరిచయం గురించి మనందరికీ తెలిసిందే.ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న సెలబ్రేషన్స్ తిరిగిన అందరూ ఒకచోట చేరి సందడి సందడి చేస్తూ ఉంటారు.

 Allu Arvind Gave Clarity Rift Mega Family ,allu Arjun, Allu Aravind , Allu Famil-TeluguStop.com

ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎక్కువగా మెగా ఫ్యామిలీలో కలుస్తూ ఉంటుంది.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత బావమరిదిగా, నిర్మాతగానూ అల్లు అరవింద్‌ చిరంజీవికి అండగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అయితే కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే రెండు కుటుంబాలకు చెందినవారు పెద్దగా కలుసుకోవడం లేదంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.మొదటి నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉంది.మా కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ వార్తలను కొట్టి పడేశాడు అల్లు అరవింద్.

Telugu Allu Aravind, Allu Arjun, Allu, Chiranjeevi, Tollywood-Movie

అయితే ఎవరి స్టార్‌ డమ్‌ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే.పిల్లలు పెద్దవారు అవుతున్నారు.ఎవరి షూటింగ్స్‌లో వారు బిజీగా ఉంటున్నారు.

అన్నిసార్లు కలుసుకోకపోవచ్చుకానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్స్‌ జరిగినా అందరూ ఒకచోట చేరిపోయి అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube