కేంద్రం వర్సెస్ రాష్ట్రం : సెప్టెంబర్ 17 న పోటాపోటీగా...?

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే  తెలంగాణ ప్రభుత్వం పై పంతం పట్టిందో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం పై  పంతం పట్టి,  ఆ పార్టీని జాతీయస్థాయిలో అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు.తెలంగాణలో తమపట్టు పెంచుకుని టిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర బిజెపి పెద్దలు పావులు కలుపుతున్నారు.

 Center Vs State September 17 As A Contest,central Home Minister, Amith Sha, Bjp-TeluguStop.com

అందుకే గత కొంతకాలంగా తెలంగాణపై బిజెపి అగ్ర నేతలంతా ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, తరచుగా పర్యటనలు చేపడుతూ,  టిఆర్ఎస్ ప్రభుత్వం ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు .ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైయ్యాయి.

దీనికోసం కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు,  కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు.

అయితే కేంద్రం ఎత్తుగడను తిప్పికొట్టేందుకు కేసిఆర్ కూడా భారీగానే ప్లాన్ చేశారు.చాలాకాలంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే తప్పకుండా విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.సెప్టెంబర్ 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వాలు భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
 

Telugu Amith Sha, Central, Karnataka Cm, Maharastra Cm, September, Telangana-Pol

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరించబోతున్నారు.దీని నిర్వహణ మొత్తం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు.తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు,  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ వంటివి చేపట్టనున్నారు.అప్పట్లో తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు,  పోరు జరిగిన కేంద్రాలను స్మరణకు తెచ్చుకోవడం,  ఎక్కడకక్కడ సభలు సమావేశాలు నిర్వహించడం వంటి ఏర్పాట్లు కేంద్రం చేస్తోంది.

కౌంటర్ గా కేసీఆర్ కూడా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించారు.దీంతో ఈ నెల 17 న పోటాపోటీగా కార్యక్రమాలు జరగబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube