సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య తన లుక్ పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే.47 ఏళ్ల వయసులో కూడా ట్రెండీ లుక్ తో మరింత చార్మింగ్ గా యువతను ఆకట్టు కుంటున్న కళల రాకుమారుడిగా మహేష్ నెట్టింట మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు.మహేష్ ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కల నెరవేరింది.ఎంతగానే ఎదురు చూసిన వారి ఎదురు చూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.ఈ సినిమా షూటింగ్ రెగ్యురల్ గా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు ఇలా కొత్త లుక్ లోకి మహేష్ మారడానికి కారణం త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా అని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం లుక్ పూర్తిగా మార్చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి ఉన్న ఫోటో బయటకు రాగ అది మరింత వైరల్ అయ్యింది.

వీరిద్దరూ కలిసి త్వరలోనే ఒక ప్రముఖ ఛానెల్ లో డ్యాన్స్ షో లో పాల్గొన బోతున్నారు అంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ రోజు దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు అందరికి బాగా ఆకట్టు కుంటుంది.

మహేష్ బాబు, సితార చేయి పట్టుకుని నడుస్తున్న బ్యూటిఫుల్ ఫోటో చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు.ఈ ఫొటోలో ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చింది.దీంతో దీన్ని వైరల్ చేసేసారు.ఇక మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాను త్రివిక్రమ్ సినిమా తెరకెక్కుతుంది.
దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అందరి ద్రుష్టి పడింది.చూడాలి ఈ సినిమాతో వీరిద్దరూ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో.