టాలీవుడ్ మన్మథుడు నాగార్జున గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నేడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.ఫ్యాన్స్ నాగార్జునను ప్రేమగా కింగ్ అని మన్మథుడు అని పిలుచుకుంటారు.

 Shocking Facts About Tollywood Star Hero Nagarjuna Details Here Goes Viral , Fut-TeluguStop.com

ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నాగార్జున వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ప్రయోగాత్మక సినిమాలలో నటించడంతో పాటు కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇచ్చిన హీరోలలో నాగార్జున ఒకరు కావడం గమనార్హం.

వయస్సు పెరుగుతున్నా ఎంతో ఎనర్జీతో కనిపించే నాగ్ సెప్టెంబర్ నెలలో బ్రహ్మాస్త్రం సినిమాతో అక్టోబర్ నెలలో ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్ విక్రమ్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.

కెరీర్ తొలినాళ్లలో నాగార్జున ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. గీతాంజలి, శివ సినిమాల విజయాలు నాగార్జున కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

Telugu Annamayya, Projects, Brahmastram, Nagarjuna, Ram Gopal Varma, Sri Ramadas

రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథను నమ్మి అవకాశం ఇచ్చిన నాగార్జునకు శివ సినిమా రూపంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో చేరింది.ఈతరం సీనియర్ హీరోలలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకున్న హీరో నాగ్ మాత్రమే కావడం గమనార్హం. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో భక్తి సినిమాలతో సైతం ప్రేక్షకులను మెప్పించి నాగార్జున విజయాలను ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

Telugu Annamayya, Projects, Brahmastram, Nagarjuna, Ram Gopal Varma, Sri Ramadas

గతా కొన్నేళ్లుగా రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ హోస్ట్ గా కూడా నాగార్జున మంచి మార్కులు సంపాదించుకున్నారు.సెప్టెంబర్ నెల 4వ తేదీ నుంచి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది.ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు ప్రచారంలోకి రాగా ఆ కంటెస్టెంట్లు షోలో ఉంటారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube