తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే విజయం భారతీయ జనతా పార్టీ బిజెపి నేతలు చెబుతున్నారు.రాష్ట్రంలో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు రాజకీయ ఎత్తుగడలపై బిజెపి నేతలు చర్చించారు.
ప్రజా సంగ్రామా యాత్ర వంటివి నిరంతరాయంగా సాగించడానికి కార్యచరణ రూపొందించాలని సూచిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు బిజెపి నేతలకు అనుమతి ఇవ్వాలని బిజెపి నాయకులు కోరుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం ఇటీవల వచ్చిన వరదల్లో ముంపునకు కారణాలు వంటి అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ మేరకు అనుమతి కోరుతూ బిజెపి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు లేఖ రాశారు.
ప్రాజెక్టును సెప్టెంబర్ తొలి వారంలో బిజెపి నేతలు సందర్శిస్తున్నారని చెప్పారు.ఇందులో బిజెపి కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ,మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ మొత్తం 30 మంది ఉంటారని చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వేలకోట్ల ప్రజాధనంతో నిర్మించిన మెగా ప్రాజెక్టుకు సమస్యను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని చెబుతున్నారు.భారీ వరదలతో జరిగిన నష్టాన్ని తెలుసుకోవడమే లక్ష్యమన్నారు.1998 వరదల్లో శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయినప్పుడు ప్రతిపక్షాలు సందర్శించాయని బిజెపి నేతలు అంటున్నారు.
2004-09 మధ్య జరిగిన జల యజ్ఞం పనులపై రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఆహ్వానించిందని బిజెపి నేతలు లేఖలో పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని నేతలు అంటున్నారు.కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు తెలంగాణ సమాజం సన్నదమైందని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం ఖాయమని అంటున్నారు.
తెలంగాణకు గొప్ప సాంస్కృతి ఉందని ప్రధాన నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే కనీసం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతం పలకలేదని సీఎం ప్రవర్తించిన తీరు ఇక్కడి సంస్కృతికి విరుద్ధమని ప్రజలు గమనిస్తున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు.