బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ గా గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.
బిగ్ బాస్ ముందు సొంత ఆల్బమ్స్ చేస్తూ సెలబ్రెటీగా మారిన రాహుల్ సినిమాలలో కూడా పాడే అవకాశాలు అందుకున్నాడు.ఇక ఈయన హౌస్ లో ఉన్నంత కాలం మంచి ఫాలోయింగ్ పెంచుకోవడమే కాకుండా మరో కంటెస్టెంట్ పునర్నవి తో ప్రేమాయణం నడిపి హౌస్ మొత్తం వారి రొమాంటిక్ తో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
ఇక వీరిద్దరూ ఎమోషన్స్, కేరింగ్ లతో ఒకరినొకరు చూసుకోగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు ప్రేక్షకులు అనుకున్నారు.ఇక బయటికి వచ్చాక కూడా వీరిద్దరి సన్నిహితం గురించి తెగ మాట్లాడుతున్నారు.
కానీ ఆ తర్వాత వీరిద్దరు దూరమయ్యారు.ఇక రాహుల్ మరో కంటెస్టెంట్ అషు రెడ్డి తో కూడా హౌస్ లో ఉన్నంత కాలం బాగా సన్నిహితంగా ఉండేది.
బయట కూడా వీరిద్దరు బాగా కలుసుకోగా వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు తెగ వార్తలు వినిపించాయి.
కానీ వీళ్లు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు ఎటువంటి ప్రేమ లేదని అడ్డు కట్టారు.
కానీ వీళ్ళు దిగిన ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.నిజానికి వీరి మధ్య క్లోజింగ్ చూస్తే మాత్రం ఎవరైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుకున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ అషు తనకు ఓ స్పెషల్ అని అన్నాడు.పైగా ఆమె ఇష్టమని కూడా తెలిపాడు.
కానీ వారి మధ్య ఎటువంటి లవ్, డేటింగ్ లేదని మనసులో మాట చెప్పాడు.
ఇక ఇప్పుడు అషు రెడ్డి రాహుల్ తో అంత క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించడం లేదు.ఇక రాహుల్ గతంలో క్లాత్ స్టోర్ కూడా ఓపెన్ చేసి బిజినెస్ పరంగా బిజీ అయ్యాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.
నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటాడు.ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ లగ్జరీ కారును గిఫ్ట్ గా పొందాడు.
దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన తమ్ముడు తనకు ఆ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ.ఆ కారును తీసుకున్న వీడియోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు.ఇక తన తమ్ముడితో పాటు తన తల్లిదండ్రులకు, తన చిచ్చా లకు థాంక్స్ చెప్పాడు రాహుల్.
ప్రస్తుతం ఆ వీడియోను చూసిన రాహుల్ అభిమానులు ఆయనకు కంగ్రాట్స్ అని చెబుతున్నారు.ఇక ఆ కారు ధర లక్షలలో ఉంటుందని తెలుస్తుంది.మొత్తానికి రాహుల్ కు తన తమ్ముడు విలువైన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.రాహుల్ ప్రస్తుతం కొన్ని ఆల్బమ్స్ చేస్తున్నట్లు తెలిసింది.