తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దర్శకులు చాలా కొత్త గా ఆలోచిస్తూ విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.హాలీవుడ్ కే పరిమితం అయిన కొన్ని కాన్సెప్ట్ లను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందులో ఒకటి తేజ హీరోగా నటిస్తున్న హనుమాన్.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మొదటి ఇండియన్ సూపర్ మ్యాన్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు.ఆ మధ్య వీరి కాంబినేషన్ లో వచ్చిన జాంబీరెడ్డి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా తర్వాత మళ్లీ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా హనుమాన్.ఈ సినిమా సోషియో ఫాంటసీ అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.
అసలు విషయం ఏంటీ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా నిర్వహిస్తున్నారు.
సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుండే సినిమా కు సంబంధించిన విడుదల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఎప్పుడెప్పుడు వస్తుంది అంటూ ఈ సినిమా యూనిట్ సభ్యుల ను ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
నేడు ఈ చిత్రం లో హీరోగా నటిస్తున్న తేజా సజ్జ పుట్టిన రోజు.ఈ సందర్బంగా సినిమా కు సంబంధించిన అప్‌డేట్ ఏమైనా ఉంటుందేమో అని. ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని అంతా భావించారు.కాని సినిమా నుండి ఒక పోస్టర్ ను మాత్రమే వదిలి సినిమా పై అంచనాలు మరింతగా పెంచారు తప్ప సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
ప్రశాంత్ వర్మ ఈ సినిమా ఎప్పుడు విడుదల అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నా ఆయన నుండి మాత్రం రెస్పాన్స్ కరువయ్యింది.