ఈ సకల సృష్టిలో ఏ ప్రాణి ఒకేలాగా ఉండదు.మన చుట్టూ ఉండే ఎన్నో రకాల జీవులు విస్తరణ మనం చూస్తున్నాం.
అయితే ఏ జీవి శరీర నిర్మాణం ఒకేలాగా ఉండదు.ఏది కదే చాలా ప్రత్యేకంగా, కాస్త ఆసక్తికరంగా ఉంటాయి.
కాకి, కోకిల, పావురం, గ్రద్ద, గబ్బిలం ఇలా ఏ ప్రాణి తీసుకున్నా సరే వాటి నిర్మాణం కాస్త విభిన్నంగా ఉంటుంది.అందులో ముఖ్యంగా గబ్బిలం అనే జీవిని తీసుకుంటే మిగతా వాటికంటే కాస్త వింతగా ఉంటుంది.
అన్ని జీవులు కాళ్ళను ఆధారంగా చేసుకుని నిలబడితే గబ్బిలం కాళ్ళను ఆధారంగా చేసుకుని వేలాడుతుంది.అసలు ఎందుకు అలా జరుగుతుందో మీకు తెలుసా?
బయాలజీ చదువుకున్న స్టూడెంట్స్ కి తెలిసే ఉంటుంది.గబ్బిలం అనేది క్షీరద జాతికి చెందిన జీవి.ఇది పక్షి అయినప్పటికీ గుడ్లు పెట్టదు.పిల్లల్ని కని, వాటికి పాలు ఇచ్చి పెంచుతుంది.ఇవి ఆహారం కోసం వేటకి వెళ్ళే సమయంలో తమ పిల్లలను పొట్టకి కరుచుకుని ఎగురుతు ఉంటాయి.
మిగిలిన పక్షులు ఎగరగలిగినా సరే వాటి కాళ్ళతో అవి కావాలంటే నడిచే అవకాశం ఉంది.కాని గబ్బిలాల కాళ్ళు మాత్రం వాటికి ఏ విధంగా ఉపయోగపడవు.
ఆఖరికి వాటి కాళ్ళ మీద అవి నిలబడలేవు.అందుకే గబ్బిలాలకి ఎగరడం మినహా మరో అవకాశం ఉండదు.
కాసేపు ఎక్కడైనా ఆగాలనుకుంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్ళతో ఏ చెట్టుకొమ్మనో, గోడ పగులునో పట్టుకొని తలకిందులుగా వేలాడతాయి.

గబ్బిలానికి ఉండే రెక్కలకీ, మిగిలిన పక్షులకి ఉండే రెక్కలకీ చాలా వ్యత్యాసం ఉంటుంది.ఇతర పక్షుల మాదిరి గబ్బిలానికి ఈకలు వుండవు.వేళ్ళ మధ్య గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు ఉంటాయి.
వేళ్ళల్లో బొటనవేలు తప్ప మిగిలిన అన్ని వేళ్ళూ గొడుగు ఊచల్లాగా ఉపయోగపడతాయి.బొటన వేలు మాత్రం పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉంటూ… ఏ చెట్టు కొమ్మనో పట్టుకుంటుని ఉంటుంది.
నిద్ర పోయే సమయంలో సైతం ఆ పట్టు జారడంటే మీరు నమ్మితీరాల్సిందే.ఆహా ఏమి సృష్టి కదూ.