ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంగా మారిపోయింది.ఇంతకు ముందులా చాలా మంది జేబులో డబ్బులు పెట్టుకుని బయటకు వెళ్లడం లేదు.
చకచకా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల సాయంతో చెల్లింపులు చేసేస్తున్నారు.చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు చేసేందుకు యూపీఐ యాప్‌లనే వాడుతున్నారు.
వీటికి బాగా అలవాటు పడిపోయిన వారికి కేంద్రం తీసుకున్న నిర్ణయం షాక్ తగలనుంది.ఇప్పటి వరకు డబ్బులు సులువుగా అంతా ట్రాన్సాక్షన్ చేసే వారు.
ఇక నుంచి వాటిపై ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది.డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల నుండి అభిప్రాయాలను కోరింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డెబిట్ కార్డులు, యూపీఐ యాప్‌లు, నెఫ్ట్ ద్వారా అంతా చెల్లింపులు చేస్తుంటారు.గత ఆరేళ్లలో యూపీఐ ద్వారా చేసే చెల్లింపులు సర్వసాధారణంగా మారాయి.26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఈ యాప్‌లను వినియోగిస్తున్నారు.కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.యూపీఐ యాప్‌ల పట్ల జనాదరణకు ప్రధాన కారణాలలో ఒకటి మర్చంట్ తగ్గింపు రేటు.
ఇది చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులపై విధించే రుసుము.యూపీఐ లావాదేవీల కోసం ప్రభుత్వం జీరో-ఛార్జ్ ఫ్రేమ్‌వర్క్‌ని తప్పనిసరి చేసింది.
ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులు అంతా ఫ్రీగా చేసేశారు.ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు.
క్రమంగా చెల్లించే రుసుమును బట్టి వాటిపై ఛార్జీలను విధించాలనే యోచనలో ఆర్‌బీఐ ఉంది.ఈ నిర్ణయం అమలైతే ఖచ్చితంగా యూపీఐ యాప్‌లను వినియోగించే వారికి షాక్ తగలనుంది.