అన్ని దానాల్లోకెల్లా రక్త దానం మిన్న రక్తదాతలు ప్రాణదాతలతో సమానం : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న అని, ఆపత్కాళ సమయంలో రక్తం అవసరమయ్యే వారి కొరకు రక్తాన్ని అందించే వారు ప్రాణదాతలతో సమానమని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

 Among All Blood Donations, Blood Donors Are Equal To Life Donors: District Coll-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను అగస్టు 8వ తేది నుండి 22వ తేది వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం రూపంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు.రక్తదానం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాని ఎటువంటి నష్టం లేదని కలెక్టర్ అన్నారు.తాను 15 – 20 సార్లు ఇప్పటికి రక్తదానం చేశానని, ఇటీవలే కరోనా రావడం వల్ల ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు.

ప్రతి 3 మాసాలకు రక్తదానం చేయవచ్చని, మనం చేసే రక్తదానంతో మనకు ఎవరో తెలియని వారికి ప్రాణదానం చేయడం మన అదృష్టమని ఆయన తెలిపారు.జిల్లాలో వైరా, మధిర, కూసుమంచి, సత్తుపల్లి అంతటా ఈరోజు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.

జిల్లాకు 500 యూనిట్ల రక్తం అవసరం ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని 750 యూనిట్ల సేకరణకు కార్యాచరణ చేశామని ఆయన తెలిపారు.

తెలంగాణా రెడ్ క్రాస్ ద్వారా రక్తదాతల నమోదుకు యాప్ ద్వారా చర్యలు చేపట్టామని, , ఇప్పటికే 2500 మంది దాతలు నమోదు అయ్యారని ఆయన అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా అవసరమున్న చోట, ఆ దగ్గర్లో ఉన్న దాత రక్తదానం చేస్తారని ఆయన అన్నారు.క్రొత్తగా రక్తదానం చేసేవారిని ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.

అందరూ ఈరోజునే రక్తదానం చేస్తాం అనుకోవడం కాకుండా.మేం రక్తదానం చేస్తామని శపథం చేయాలని కలెక్టర్ కోరారు.

ప్రజాప్రతినిధులను ఈ దిశగా కోరానని ఆయన అన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, పెద్దఎత్తున యువత రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా.బి.మాలతి, కార్పొరేటర్ బి.జి.క్లైమెంట్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ డా.బి.శ్రీనివాసరావు, డా.కృపా ఉషశ్రీ, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube