భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రస్తుతం 53 అడుగులకు చేరింది.దీంతో అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
కాగా, ఈ రాత్రికి 55 అడుగులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.