భ‌ద్రాచలం వ‌ద్ద మ‌ళ్లీ గోదావ‌రి ఉగ్ర‌రూపం

భ‌ద్రాచ‌లం వ‌ద్ద మ‌ళ్లీ గోదావ‌రి ఉగ్ర‌రూపాన్ని దాల్చుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న వ‌ర‌ద ప్ర‌వాహంతో గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది.

భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటిమ‌ట్టం ప్ర‌స్తుతం 53 అడుగుల‌కు చేరింది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు.

కాగా, ఈ రాత్రికి 55 అడుగుల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.నీటిమ‌ట్టం పెరుగుతున్న నేప‌థ్యంలో ముంపు ప్రాంత ప్ర‌జ‌లు, లోత‌ట్టు ప్రాంత వాసులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

నలుగురు భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్ .. ఏం చేశారంటే?