20 ఏళ్ల క్రితం ఇంద్ర సినిమా.. ఇప్పుడు తప్పులు వెతుకుతున్న నెటిజన్స్.. అంత పెద్ద తప్పు ఏంటంటే?

కొందరు ప్రేక్షకులు సినిమాను కేవలం కథ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వరకు చూస్తూ ఉంటారు.కానీ మరికొందరు ప్రేక్షకులు మాత్రం అలా కాదు.

 Trollers Find Mistake In Megastar Chiranjeevi Indra Film Know Details Inside , I-TeluguStop.com

నిజానికి వాళ్లే ఆ సినిమాలో కావాలని వెతికి మరీ తప్పులు తీస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసే సినిమాలలో కొన్ని పొరపాట్లు చాలా సులువుగా కనిపిస్తుంటాయి.

దీంతో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.దర్శకులు కూడా వీటిని ప్రేక్షకులు అంతగా పసిగట్టరు అనుకొని పొరపాట్లు చేస్తారు.

కానీ కొన్ని పొరపాట్లను కొందరు ప్రేక్షకులు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు.వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలామంది సినిమాల్లో వచ్చిన పొరపాట్లు గురించి సోషల్ మీడియాలో పెట్టి బాగా ట్రోల్స్ చేశారు.కొన్నిసార్లు దర్శకులు, ఎడిటర్లు కూడా ఇటువంటి పొరపాట్లు పూర్తిగా పరిశీలించి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాటిని కనిపించకూడదని కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉంటారు.

మరికొందరు ప్రేక్షకులు అంతగా ఏమీ గమనించరు అనుకొని పొరపాట్లు చేస్తూ ఉంటారు.కానీ ప్రేక్షకులు పెద్ద పెద్ద సినిమాల విషయంలోనే ఎటువంటి పొరపాట్లు దొరుకుతాయా అని చూస్తారు.

ముఖ్యంగా తమకు నచ్చని హీరో సినిమా ఉంటే మాత్రం బాగా పరిశీలించి మరి ఆ తప్పును బయట పెడుతూ ఉంటారు.ఇక స్టార్ హీరోల సినిమాలలో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు.

చాలా వరకు సినిమా విడుదలైన వెంటనే అందులో ఉన్న పొరపాట్లు ఏంటో గమనిస్తూ ఉంటారు.కానీ తాజాగా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఇంద్ర సినిమాలోని తప్పులను ఇప్పుడు బయట పెడుతున్నారు నెటిజన్లు.ఇంతకూ ఆ తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.2002లో డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన సినిమా ఇంద్ర.

Telugu Arthi Aggarwal, Gopal, Indra, Chiranjeevi, Sonali Bindre, Tollywood, Trol

ఈ సినిమాలో చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా విడుదలై ఇటీవలే దాదాపు 20 ఏళ్లు దాటింది.అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అలా ఇప్పటికీ ఈ సినిమా అంటే ప్రేక్షకులు బాగా ఆసక్తి పెట్టి చూస్తుంటారు.ఇంత కాలానికి ఈ సినిమాలో ఒక పొరపాటు వెతికారు నెటిజన్లు.ఇంతకు ఆ పొరపాటు ఏంటంటే.

ఈ సినిమాలో చిరంజీవి, సోనాలి బింద్రే. రాధే గోవింద అనే పాటకు స్టెప్పులు వేయగా అందులో.చిరంజీవి సోనాలి బింద్రేను చూసి జడతో నా మనసు లాగేసిందా అంటూ ఒక లైన్ పాడుతూ తన జడను చూపించబోతాడు.కానీ అందులో తన జడ కనిపించదు.

Telugu Arthi Aggarwal, Gopal, Indra, Chiranjeevi, Sonali Bindre, Tollywood, Trol

దీంతో నెటిజన్లు అక్కడ జడనే లేదు కదా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు అందులో చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ చూసి.చిరంజీవి కూడా జడ లేనందుకు షాక్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ పొరపాటు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube