మాస్ రాజా ఐటెం సాంగ్ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందా?

మాస్ రాజా రవితేజ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలుసు.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

 Naa Peru Seesa Item Song From Ramarao On Duty, Naa Peru Seesa Song, Anveshi Jain-TeluguStop.com

ఇక అందరి హీరోలకు ఉన్న సెంటిమెంట్ లాగానే మాస్ రాజాకు కూడా ఒక సెంటిమెంట్ ఉంది.ఈయన సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే.

రవితేజ గత సినిమా క్రాక్ సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంది.భూమ్ బద్దల్ అనే సాంగ్ తో థియేటర్ లో విజిల్స్ వేయించాడు.మరి ఇప్పుడు రవితేజ చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ లో కూడా ఇదే ఐటెం సాంగ్ సెంటిమెంట్ ను రవితేజ నమ్ముతున్నాడు.

ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుండి ‘నా పేరు సీసా’ అనే ఐటెం సాంగ్ ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.

Telugu Anveshi Jain, Item, Naaperu, Naa Peru Seesa, Rajisha Vijayan, Ramarao Dut

అన్వేషి జైన్ తో రవితేజ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.ఈమె హాట్ గ్లామర్ షో బాగా ఎలివేట్ అయ్యింది.ఈ ఐటెం సాంగ్ థియేటర్స్ లో ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించడం ఖాయం అంటూ మేకర్స్ సైతం చెబుతున్నారు.మరి ఈ ఐటెం నెంబర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందో లేదో చూడాలి.

రవితేజ సెంటిమెంట్ ప్రకారం ఈ పాట సరైన టైం లో పడితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.చూడాలి మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube