టాలీవుడ్ నటుడు మాధవన్ తన సొంత దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘రాకెట్రీ’. ఇందులో మాధవన్ తో పాటు సిమ్రాన్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషల్, సూర్య, షారుఖ్ ఖాన్ తదితరులు నటించారు.శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని అందించాడు.సిర్షా రేయ్ సినిమాటోగ్రఫీ అందించాడు.ట్రై కలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ సంస్థపై సరిత మాధవన్, మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మాలన్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్ లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే నంబి నారాయణన్ (మాధవన్) ఇస్రో శాస్త్రవేత్త. మన దేశ రహస్యాలు పాకిస్తాన్ కు చేరవేశారని అభియోగంతో అతనిని అరెస్టు చేస్తారు.
ఇక కొన్ని రోజుల తర్వాత అతడు బెయిల్ మీద బయటకి రాగా.అతడిని సూర్య ఇంటర్వ్యూ చేస్తాడు.ఇక ఆ సమయంలో అసలు నంబి నారాయణ్ ప్రస్థానం ఎలా మొదలైంది.ఆయన చదువుకున్న రోజుల్లో ఎలా గడిచాయి.
ఆయన చేసిన అంతరిక్ష పరిశోధనల కృషి. అతనిపై పడిన ఆరోపణలు.
తర్వాత నిర్దోషి అని తెలియటం.ఇక అతడి అరెస్టు తర్వాత అతని కుటుంబాన్ని సమాజం ఎలా ట్రీట్ చేసిందని.
ఆయన నిరపరాధి అని.తప్పు చేయలేదని ఏ విధంగా నిరూపిస్తారు అనేది ఇలా అనేక రకాల ఆయన చేసిన త్యాగాల గురించి తెరపైకి వచ్చింది.
నటినటుల నటన:
మాధవన్ తన నటనకు పూర్తి న్యాయం చేశాడు.సిమ్రాన్ కూడా అద్భుతంగా నటించింది.
ఇక మిగతా నటీనటులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.మాధవన్ ఈ సినిమాతో సగమే సక్సెస్ అయ్యారు.ఇక స్క్రిప్ట్ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటే బాగుండేది.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మిగతా టెక్నికల్ భాగాలు అన్ని ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ:
ఇది ఒక బయోపిక్ ఆధారంగా వచ్చిన సినిమా కాగా.మాధవన్ ఫస్ట్ ఆఫ్ లో ఈ సినిమాను సైన్స్ కి సంబంధించిన విషయాలకు తీసుకెళ్లాడు.
అందులో కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉండగా.అవి మాత్రం బాగా ఆసక్తిగా అనిపిస్తుంది.
ఇక సెకండ్ ఆఫ్ లో.ఎప్పుడైతే నంబి నారాయణని అరెస్టు చేస్తారో అప్పటినుంచి మరింత ఆసక్తిగా అనిపిస్తుంది.ఇక ఈ సినిమా సామాన్యుడిని ఆకట్టుకోవటం చాలా కష్టమని చెప్పాలి.క్లైమాక్స్ మాత్రం బాగా అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్:
కథలో మలుపులు, మాధవన్ నటన, ఎమోషనల్ సన్నివేశాలు, కీలక సన్నివేశాలు బాగా కట్టుకున్నాయి
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరి విషయం కి వస్తే ఓ గొప్ప సైంటిస్టుని.దేశభక్తుడిని ఈ తరానికి పరిచయం చేశాడు మాధవన్.కచ్చితంగా ఈ సినిమా బయోపిక్ ని ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.