వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొండా సినిమా కు వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.వరంగల్ కి చెందిన కొండా మురళి మరియు కొండా సురేఖ యొక్క జీవిత చరిత్ర ఆధారం గా తెరకెక్కిన సినిమా ఇంత తక్కువగా వసూళ్లను రాబట్టడం తో అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో ఈ మధ్య కాలం లో రూపొంది వస్తున్న సినిమా లను జనాలు ఆధరించడం లేదు.కొందరు ఆయన అభిమానులు చూస్తూ ఉన్నారు.
కాని కొండా సినిమా ను ఆయన అభిమానులు కూడా చూడలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.ఈ సినిమా మినిమంగా వసూళ్ల ను సాధించే అవకాశం ఉందని అంతా భావించారు.
కానీ ఈ సినిమా కూడా గత వర్మ సినిమాల మాదిరిగానే నిరుత్సాహం నే మిగిల్చింది.ఈ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ సమయంలో చేసిన సీక్వెల్ ప్రకటన గురించి మీడియాలో చర్చ జరుగుతోంది.
కొండా సినిమా ప్లాప్ అయ్యింది.కనుక ఈ సినిమా కు సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ ఆయన్ను కొందరు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ సీక్వెల్ కు సంబంధించిన ప్రకటనల వీడియో లు వైరల్ అవుతున్నాయి.పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మ పై అంచనాలు పెట్టుకుని సినిమా కు వెళ్లిన వారు మరీ నిరుత్సాహం గా వెనక్కు వస్తున్నారు.ఇప్పటికే థియేటర్ల నుండి కొండా కనిపించకుండా పోయాడు.ఓటీటీ లో త్వరలో కొండా వస్తాడేమో చూడాలి. కొండా సినిమా ప్లాప్ నేపథ్యం లో వర్మ తన ప్లాన్స్ ను మార్చుకున్న ఆశ్చర్యం లేదని మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.