బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అతి తక్కువ సమయంలో మంచి ఆదరణ పొందింది.బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతరుల ఎంటర్టైన్మెంట్ షోలలో కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం రేటింగులో బాగా దూసుకుపోతుంది.
పైగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు అన్ని రకాల నవరసాలను చూపిస్తూ ఉంటారు.
ఒకప్పుడు ఇందులో సుడిగాలి సుధీర్, ఇంద్రజ లు ఉన్నప్పుడు షో బాగా హైలెట్ గా నిలిచింది.
తల్లి కొడుకు అనే బాండింగ్ తో సుధీర్, ఇంద్రజ లు కలిసి ఉండేది.పైగా సుధీర్ ఇందులో కొత్త కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వాడు.
ఎప్పుడు కూడా టీఆర్పీ కోసం పిచ్చి పిచ్చి ట్రిక్స్ వాడలేదు.ఏది ఉన్న బాగా సందడి మాత్రం చూపించేవాడు సుధీర్.
ఇక సుధీర్ ప్రస్తుతం వెండితెరపై బిజీగా మారటంతో బుల్లి తెరకు దూరంగా ఉన్నాడు.ముఖ్యంగా జబర్దస్త్ షో, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బయటికి వచ్చాడు.
కొంతకాలానికి ఇంద్రజ కూడా ఆ షో నుండి బయటికి వచ్చింది.ఇప్పుడు అందులో యాంకర్ గా రష్మి.
జడ్జిగా నటి పూర్ణ ఉన్నారు.
ఇక ఇందులో బుల్లితెర నటీనటులను, జబర్దస్త్ కమెడియన్ లను, సోషల్ మీడియా సెలబ్రెటీలను ఆహ్వానించి వారితో బాగా సందడి చేయిస్తున్నారు.
ముఖ్యంగా టిఆర్పీ కోసం వీళ్లు కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు కనిపించింది.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.మామూలుగా టీఆర్పీ కోసం మధ్య మధ్యలో గొడవ పెట్టుకోవడం, తిట్టుకోవడం, షో నుంచి బయటికి వెళ్లిపోవడం, ఏదైనా ప్రమాదం లాంటివి చూపిస్తూ ఉంటారు.
దీంతో చాలా మంది ప్రేక్షకులు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి జనాలను పిచ్చోళ్ళ చేయవద్దు అని అంటుంటారు.అలా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా బుల్లెట్ భాస్కర్ తండ్రి కింద పడిపోవడంతో ఇది కూడా టీఆర్పీ కోసం ఇలా చేశారేమో అని అంటున్నారు నెటిజన్లు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
అందులో పెళ్ళాం చెబితే వినాలి అనే కాన్సెప్ట్ తో వచ్చారు.
ఇక అందులో హైపర్ ఆది ఎప్పటి లాగే తన పంచులతో బాగా నవ్వించాడు.బుల్లితెర నటి శ్రీవాణి తన భర్త తో బాగా సందడి చేసింది.ఇక ఆడ వాళ్లు, మగ వాళ్ళు ఇద్దరు టీములుగా విడిపోయి తెగ సందడి చేశారు.
అలా కబడ్డీ కూడా ఆడుతూ ఉండగా అందులో బుల్లెట్ భాస్కర్ తండ్రి. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కూత పెడుతూ ముందుకు పడ్డాడు.దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యి అక్కడికి పరుగులు తీయగా.ఇదంతా టీఆర్పీ కోసం మరో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారేమో అని నెటిజన్లు అంటున్నారు.
మరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.