ఎమోషనల్ అయిన ఉపాసన.. నేను చాలా అదృష్టవంతురాలిని అంటూ..

మెగా కుటుంబం నుండి మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఈయన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

 Ram Charan's Wife Upasana Shares Emotional Post, Rc15 , Ram Charan , Director Sh-TeluguStop.com

RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ కు ప్రెసెంట్ చరణ్ కాస్త బ్రేక్ ఇచ్చారు.రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు జరుపు కుంటున్న నేపథ్యంలో ఈ సినిమా షూట్ కు బ్రేక్ వచ్చింది.

వీరి 10వ పెళ్లి రోజు రావడంతో ఈ దంపతులు ఈ స్పెషల్ డే ను గ్రాండ్ గా జరుపు కున్నారు.ఈ క్రమంలోనే వీరు ఇద్దరు కలిసి కుటుంబంతో ఎంజాయ్ చేసిన ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేసింది చరణ్ భార్య ఉపాసన.ఈ ఫోటోలు మెగా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇద్దరు కలిసి చేయి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటో.

చరణ్ స్నేహితుల మధ్య ఉన్న ఫోటో.మరింత ఆకట్టు కుంటున్నాయి.ఈ ఫొటోలతో వీడియో చేసి ఉపాసన పోస్ట్ చేసింది.”మా చుట్టూ ప్రేమించే శ్రేయోభిలాషులు ఇంత మంది ఉన్నందుకు మేం నిజంగా అదృష్టవంతులం.మా వార్షికోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదములు.కృతజ్ఞతతో.అంటూ ఎమోషనల్ అవుతూ ఈమె వీడియో షేర్ చేసింది.ఉపాసన కుటుంబం గురించి స్నేహం గురించి తన మాటల్లో చెబుతూ ఎమోషనల్ అవ్వడం నెటిజెన్స్ ను ఆకర్షించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube