షాకింగ్ సర్వే : అమెరికా విద్యార్ధులా....వీధి రౌడీలా....!!

అగ్ర రాజ్యం అమెరికా అంటే కేవలం ఆర్ధిక, టెక్నాలజీ ఇలా కొన్ని రంగాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసుకోలేదు, ప్రతీ విషయంలో అమెరికా అగ్ర రాజ్యమే.చివరికి హై స్కూల్ కు వెళ్ళే విద్యార్ధులు సైతం స్కూల్ బ్యాగ్ లలో పుస్తకాలతో పాటు తుపాకులు తీసుకెళ్ళే సంస్కృతీ కూడా అమెరికా సొంతం.

 Shocking Survey American Students Street Rowdies , American , Street Rowdies, F-TeluguStop.com

ఇప్పటికే అమెరికాలో పెరిగిపోతున్న తుపాకి సంస్కృతి కారణంగా తీవ్ర ఆందోళన చెందుతున్న అమెరికన్స్ తాజాగా వారి పిల్లలు గన్ కల్చర్ కు ఏ స్థాయిలో దగ్గరవుతున్నారో తాజాగా వెల్లడైన సర్వే చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఈ సర్వే వెల్లడించిన వివరాలు చూస్తే వీళ్ళు విద్యార్ధులా వీధి రౌడీలా అనే సందేహం తప్పకుండా వస్తుంది.

ఇంతకీ ఏమిటా సర్వే.అనే వివరాలలోకి వెళ్తే.

న్యూయార్క్ కి చెందిన ఓ సర్వే సంస్థ తమ నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గన్ కల్చపై ఓ సర్వే చేపట్టింది.ఏడాది కాలంగా న్యూయార్క్ లో జరిగిన తుపాకి పేలుళ్లు మరణించిన వారి వివరాలు సేకరిస్తూ ఓ సర్వే చేపట్టింది.

ఈ సర్వేలో సర్వే సంస్థకే దిమ్మ తిరిగిపోయే షాకింగ్ ఘటనలు బయల్పడ్డాయట.న్యూయార్క్ సిటీ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్ధుల నుంచీ కేవలం ఒక్క ఏడాది కాలంలో సుమారు 6 వేల తుపాకులు స్వాధీనం చేసుకున్నారట.

స్కూల్ భద్రతా అధికారులు రోజు వారీ చేసే భద్రతా ప్రమాణాలలో స్కూల్ విద్యార్ధులు ఎంతో మంది స్కూల్ బ్యాగ్స్ లో తుపాకులు తీసుకువస్తున్నారని తెలిపారు.అంతేకాదు.

విద్యార్ధులు తుపాకులతో పాటు కత్తులు, చైన్స్, స్టీల్ రాడ్డులు వంటి ప్రమాదకరమైన ఆయుధాలు తీసుకువస్తున్నారని భద్రతా అధికారులు వెల్లడించారు.ఓ రోజు ఒక విద్యార్ధి తనతో పాటు తుపాకి తెచ్చుకుంటే అతడిని చూసి మరుసటి రోజు కొందరు విద్యార్ధులు తుపాకులు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో తాము చూశామని వారు వాపోతున్నారు.

ప్రస్తుతం అమెరికా విద్యార్ధులలో పెరుగుతున్న ఈ ట్రెండ్ భవిష్యత్తులో వారి ప్రాణాలకు ముప్పు కల్గించవచ్చునని హెచ్చరిస్తున్నారు నిపుణులు.అంతేకాదు పిల్లలు ఎలా ఉంటున్నారు, తమతో పాటు ఏ ఏ వస్తువులు తీసుకువెళ్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటోంది అనే విషయాలు తల్లి తండ్రులు గమనించకపోతే తల్లితండ్రులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube