హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడినది ఐదుగురు వ్యక్తులని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కాగా, మిగతా నలుగురు మైనర్లుగా పేర్కొన్నారు.
అత్యాచారానికి ముందే కారు దిగి వెళ్లిపోయిన మరో మైనర్‌ను ఆరో నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44, పెద్దమ్మ గుడి వెనకాల ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు వివరించారు.
తొలుత ఓ మైనర్, ఆ తర్వాత ఇతర మైనర్లు, చివరగా సాదుద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్నొన్నారు.బాలిక మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.
ఘటన జరిగిన నాటి నుంచి జరిగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ వెల్లడించారు.సాదుద్దీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని.ఐదుగరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.
దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని.ఆధారాల సేకరణలో కొంత జాప్యమైనా నిందితులకు కఠిన శిక్షలు పడేలా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
సీపీ చెప్పినదాని ప్రకారం