సీఎం ఎన్టీఆర్.. కాదు సీఎం పవన్ కళ్యాణ్.. అభిమానుల మధ్య షాకింగ్ గొడవ.. చివరికి?

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు ఉండే అభిమానుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమ అభిమాన హీరోలకు చూపించే అభిమానం మరెవ్వరికీ చూపించరు అని చెప్పాలి.

 East Godavari Pawan Kalyan Ntr Fans Flexy Fight, Pawan Kalyan, Jr Ntr, Fans Fig-TeluguStop.com

ముఖ్యంగా తమ అభిమాన హీరోలను వేరే అభిమాన హీరోలు ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు.ప్రతి చిన్నదానికి పెద్ద గొడవతో బాగా రచ్చరచ్చ చేస్తారు.

నిజానికి హీరోలు-హీరోలు బాగానే ఉంటారు కానీ హీరోల అభిమానులే ప్రతి చిన్న దానికి పెద్ద గొడవ చేసి దానిని బాగా ట్రెండ్ చేస్తారు.చివరికి అది హీరోల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్లు వాటిని లైట్ తీసుకుంటూ ఉంటారు.

అంతేకానీ హీరోల మధ్య మాత్రం విభేదాలు రావు.అలా ఇప్పటికీ ఎంతో మంది హీరోల అభిమానుల మధ్య విభేదాలు వచ్చాయి.

కానీ హీరోలు మాత్రం వాటిని లైట్ తీసుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పలువురు స్టార్ హీరోల అభిమానులు చాలాసార్లు ఏదో ఒక వివాదాన్ని సృష్టించారు.

ఇక తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు కూడా పెద్ద గొడవ చేశారు.మామూలుగా అభిమానులు తమ అభిమాన హీరో కోసం సినిమా విషయాల్లో గొడవ పడతారని తెలుసు.

కానీ కొందరు అభిమానులు మాత్రం రాజకీయ పరంగా కూడా గొడవ పడతారు.

Telugu Allu Arjun, Godavari, Fans, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas-Mo

గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి విషయంలో కూడా ఆయన అభిమానులు రాజకీయ పరంగా బాగా వివాదం సృష్టించారు.అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయనను రాజకీయ పరంగా మధ్యలోకి లాగుతూ సంచలనం సృష్టించారు.దాంతో ఎన్టీఆర్ అప్పుడే ఆ విషయం గురించి స్పందించి గొడవను సద్దుమణిగేలా చేశాడు.

అయినా కూడా అభిమానుల తీరు మాత్రం మారలేదు.మళ్లీ తాజాగా ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద వివాదం సృష్టించారు.

తాజాగా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా అక్కడున్న ఈ స్టార్ హీరోల అభిమానులు.

తమ అభిమాన హీరోలు అయిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం కూడా చేశారు అభిమానులు.

దీంతో సీఎం పవన్ కళ్యాణ్, సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇద్దరి అభిమానుల మధ్య జోరుగా నినాదాలు జరిగాయి.

Telugu Allu Arjun, Godavari, Fans, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas-Mo

దీంతో మా హీరోనే సీఎం అంటూ కాదు మా హీరో నే సీఎం అంటూ బాగా వివాదం సృష్టించారు.ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని పెద్ద గొడవ చేశారు.దీంతో అక్కడున్న స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు తెలియజేయడంతో.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అక్కడున్న గొడవని సద్దుమణిగేలా చేశారు.ఇక ప్రస్తుతం వారిపై పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube