సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.
ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.అయితే ప్రెసెంట్ మహేష్ బాబు జర్మనీ లో ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక్కడి నుండి వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే సినిమా గ్యాప్ లేకుండా చేయాలని అనుకున్నాడు.
జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక కాలనీ సెట్ కూడా రెడీ చేస్తున్నారట.యూరప్ వెకేషన్ కోసం వెళ్లిన మహేష్ ఇప్పట్లో తిరిగి రారని త్రివిక్రమ్ మహేష్ బాబు దగ్గరికే వెళ్లి కొన్ని విషయాలపై చర్చలు చేస్తున్నారట.
త్రివిక్రమ్ కూడా ప్రెసెంట్ జర్మనీ వెళ్లి స్క్రిప్ట్ విషయంలో మహేష్ తో మాట్లాడు తున్నారని వార్తలు వస్తున్నాయి.
స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయినప్పటికీ మహేష్ కు ఉన్న కొన్ని డౌట్ లను క్లారిటీ చేస్తున్నాడట.మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.