భార్యపై ప్రేమను బయటపెట్టిన రణవీర్ సింగ్.. కూర్చోబెట్టుకుని అలా చేస్తానంటూ?

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే ముందువరసలో ఉంటారు.తాజాగా రణవీర్ సింగ్ తన భార్యపై ఉన్న ప్రేమను బయటపెట్టారు.

 Ranaveer Singh Comments About His Wife Goes Viral In Social Media Details Here-TeluguStop.com

తన భార్య అయిన దీపికా పదుకొనే అద్భుతమైన చెఫ్ అని రణవీర్ సింగ్ అన్నారు.లాక్ డౌన్ సమయంలో తాను, దీపిక చాలా బాగా ఎంజాయ్ చేశామని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో దీపికా పదుకొనే తన కోసం చాలా వంటకాలు చేసిందని రణవీర్ సింగ్ తెలిపారు.

దీపికా పదుకొనే చేసే వంటకాలలో రొయ్యలతో చేసే చైనీస్ వంటకం ఎంతో రుచిగా ఉంటుందని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఈ మధ్యనే తాను, దీపిక కలిసి కొత్త ఇల్లు తీసుకున్నామని రణవీర్ సింగ్ కామెంట్లు చేశారు.నాకు వంట రాదని వంట రాకపోయినా కొత్తింట్లోకి వెళ్లిన తర్వాత దీపికా పదుకొనే కొరకు తాను బ్రేక్ ఫాస్ట్ చేస్తానని రణవీర్ అన్నారు.

నా ఒడిలో దీపికను కూర్చోబెట్టుకుని ఆమెకు చేతులతో టిఫిన్ తినిపిస్తానని రణవీర్ కామెంట్లు చేశారు.

తన భార్య కోసం ఎగ్ కర్రీ చేస్తానని తాను గతంలో మాట ఇచ్చానని తన ఫ్యాన్స్ ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఉంటారని రణవీర్ వెల్లడించారు.

మూడేళ్ల క్రితం దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ల వివాహం జరిగింది.రణవీర్ సింగ్ దీపికపై ప్రేమను వ్యక్తం చేస్తున్న విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఎన్నో జంటలకు వీళ్ల జంట ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భార్య చేసిన వంటకాలను సైతం రణవీర్ సింగ్ ప్రశంసిస్తున్నారు.

తనకు వంట రాకపోయినా భార్య కోసం వంట నేర్చుకున్నానని రణవీర్ సింగ్ వెల్లడించారు.భార్యను ఏ విధంగా ఇంప్రెస్ చేయాలో తనకు బాగా తెలుసని రణవీర్ సింగ్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube