దివంగత నటి ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహానటి సావిత్రి తర్వాత అంతటి అందం అంతటి అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ సౌందర్య.
ఆమె పేరుకు తగ్గట్లుగానే ఆమె అభినయం కూడా ఉంటుంది అని చెప్పాలి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు హవా నటిపించిన సౌందర్య చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచు లాగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక మన వాళ్లకు నచ్చితే ఊరుకోరు కదా సౌందర్యను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నారు.
కానీ సౌందర్య అకాల మరణం తో అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతి లో మునిగిపోయారు అని చెప్పాలి.స్టార్ హీరోల సినిమాల్లోనే కాదు అప్పట్లో కమెడియన్ గా అలీ లాంటి వాళ్ల సరసన నటించేందుకు కూడా ధైర్యం చేయడం కేవలం సౌందర్యకు మాత్రమే నెప్పింది అని చెప్పాలి.
అప్పట్లో అలీ హీరోగా యమలోకం కాన్సెప్టుతో కృష్ణారెడ్డి దర్శకత్వంలో యమలీల అనే సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అని దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.సౌందర్యను తీసుకుంటే పాత్రకు బాగా సెట్ అవుతుందని అనుకున్నారు దర్శకుడు కృష్ణారెడ్డి.
ఇక ఆ తర్వాత సౌందర్యకు కథ వినిపించారు.కథ నచ్చడంతో సౌందర్య కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పింది.
హీరో కమెడియన్ అలీ అని తెలిసినా కూడా కు రెడీ అయ్యింది.ఆ తర్వాత ఇతర నటుల ఎంపిక లో బిజీ అయ్యాడు దర్శకుడు కృష్ణారెడ్డి. అంతలో ట్విస్టు సౌందర్యకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు ఆమెను కలిసి మీరు అలీతో సినిమా చేస్తే మీ మార్కెట్ పడిపోతుంది.మీ సినిమాలు ఎవరు చూడరు అంటూ భయపెట్టారు.
మీ కెరియర్ కూడా ఒక్కసారిగా డ్రాప్ అవుతుందని చెప్పడంతో అప్పటికే మాట ఇచ్చిన సౌందర్య కృష్ణ రెడ్డికీ ఎలా చెప్పాలో తెలియక జ్వరం వచ్చింది.అప్పుడే సౌందర్య తండ్రి సత్యనారాయణ అసలు విషయాన్ని కృష్ణారెడ్డికీ చెప్పాడు.
ఇక ఆ తర్వాత కృష్ణారెడ్డి కూల్ గా ఆమెను తప్పించి ఇంద్రజ ను ఎంపిక చేశారు ఇక ఇంద్రజ ఈ ప్రాజెక్టుతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
.