టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ పై సీరియస్ డైలాగులు వేశారు.ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ కూడా తప్పు చేసే మనిషిని కాదు… నిప్పులాంటిమనిషి నని చెప్పుకొచ్చారు.ఎన్ని కుట్రలు చేసినా ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు.
నేను కన్నెర్ర చేస్తే జగన్ తట్టుకోలేడు.అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ పరిపాలన లో బాదుడే బాదుడు అప్పులు… ప్రజలకు వేధింపులు తప్ప ఏమీ లేదని అన్నారు.
ఇదే సమయంలో పర్యటనలో టీడీపీ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు తొలగించటం…వైసీపీ జెండాలు కట్టటం వివాదంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
తాటాకు చప్పుళ్ళకు ఎవడు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
ఇక ఇదే సమయంలో మహానాడు నుంచి దృష్టి మళ్లించడానికి…వైసీపీ బస్సుయాత్ర ప్లాన్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.ఒంగోలు లో జరిగే మహానాడు లో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించుకుందాం అని తెలిపారు.
ప్రభుత్వంపై పార్టీ తరపున పోరాడే ప్రతి కార్యకర్త వీరుడే అని పోల్చారు.ఇంకా అనేక విమర్శలు జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు చేశారు.