మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు రాం చరణ్.పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఈ సినిమా వచ్చింది.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ చిరుత సినిమా నిర్మించారు.మెగా వారసుడు ఎంట్రీ సినిమా అంటే మాములుగా ఉండదు.
కానీ ఈ సినిమా కోసం చిరు తనయుడు అదేనండి రాం చరణ్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.చిరుత సినిమా కోసం చరణ్ కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నారట.
సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే కానిచ్చారని తెలుస్తుంది.పూరీ సినిమా అంటే బడ్జెట్ చాలా కంట్రోల్ గా ఉంటుంది.అంతేకాదు చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది.చిరుత సినిమాకు కూడా అనుకున్న విధంగానే తక్కువ రోజుల్లో పూర్తి చేశారట.
ఈ సినిమాకు చరణ్ 50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నారట.ఇక సినిమా సినిమాకి చిరు తనయుడిగా కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాం చరణ్.
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒకరు అనిపించుకుంటున్నారు. వరుస క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నారు.