ప్రభాస్ రాజా డీలక్స్ కోసం థమన్..!

రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటుగా ప్రాజెక్ట్ K సినిమా కూడా లైన్ లో ఉంది.

 Prabhas Raja Deluxe Thaman Music , Dvv Danaiah , Maruthi, Maruthi Movie, Prabhas-TeluguStop.com

ఈ మధ్యలో మారుతి డైరక్షన్ లో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్.మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ థ్రిల్లర్ మూవీ వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాని RRR నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ని ఫిక్స్ చేసినట్టు టాక్.

ఈమధ్య థమన్ వరుస క్రేజీ సినిమాలతో వస్తున్నాడు.

మ్యూజిక్ పరంగా సినిమాకు కావాల్సిన బజ్ ఏర్పరచడంలో సక్సెస్ అవుతున్నాడు థమన్.ఇప్పటికే వరుస స్టార్ సినిమాలు చేస్తున్న థమన్ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

థ్రిల్లర్ జానర్ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అందుకే ఈ సినిమా కోసం థమన్ ని కావాలని తీసుకున్నట్టు తెలుస్తుంది.

రాధేశ్యామ్ సినిమాకు థమన్ బిజిఎం అందించాడు.ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాకు ఫుల్ లెంగ్త్ మ్యూజిక్ అందించబోతున్నాడు.

ప్రభాస్, థమన్ కాంబో సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube