టాలీవుడ్ లో నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటే మొదటగా మనకు గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి.ఎందుకంటే ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అయినవి కావడం మరియు తన కథలలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ రాబోయే యంగ్ డైరెక్టర్ లకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
అయితే ఒక సినిమాను తెరకెక్కించిన తర్వాత దానిని ఎలా సొమ్ము చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని చెప్పాలి.ఆ సినిమాను ఎన్ని విధాలుగా మార్కెటింగ్ చేయగలడో.
అన్ని విధాలుగా చేస్తాడు.దీని కోసం విభిన్న మార్కెటింగ్ పద్దతులను తీసుకొచ్చి సక్సెస్ అవుతూ ఉంటాడు.
అందుకు ఉదాహరణే బాహుబలి లాంటి సినిమాకు 2000 కోట్ల కలెక్షన్ లు వచ్చేలా చేశాడు.
కాగా ఇటీవల విడుదల అయిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ను కూడా అదే విధంగా అంతకు మించి డబ్బును వసూలు చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారు అని తెలుస్తోంది.
ఇప్పుడు ఓ టీ టి ద్వారా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.అయితే ఒ టి టి లో సినిమాను చూడాలంటే కూడా అమౌంట్ పే చేసే విధంగా సిస్టమ్ ను తీసుకు రానున్నారు అని తెలుస్తోంది.
కరోనా అనంతరం ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలి అన్న విషయంపై ఫుల్ క్లారిటీ గా ఉన్నారు.సూపర్ హిట్ అయితే తప్ప థియేటర్ కు వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు.
ఒక మాదిరిగా ఉన్న సినిమాలను ఒ టి టి లేదా టీవీ లలో వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తున్నారు.ఎందుకంటే ఇప్పుడు థియేటర్ కు వెళ్ళాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి.
టికెట్ ధర, పార్కింగ్, క్యాంటీన్, పెట్రోల్ ఖర్చు ఇవన్నీ సామాన్యుడు బేరీజు వేసుకుని ఇంత అవసరమా అంటూ ఉండిపోతున్నాడు.

అందుకే చాలా సినిమాలు సరైన కలెక్షన్ లు రాక ప్లాప్ లుగా మిగిలిపోతున్నాయి.అదే విధంగా ఆర్ ఆర్ ఆర్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.అయితే వీరి చెబుతున్న ప్రకారం ఈ సినిమాకు అయిన ఖర్చు 350 కోట్లు అట.అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు.ఎందుకంటే ఇందులో బాహుబలి లాగా ఏమీ పెద్ద పెద్ద విజులైజేషన్ కాదు.
మామూలు గ్రాఫిక్స్ మాత్రమే.అవతార్ లాగా అయితే అన్ని కోట్లు అయితే ఒప్పుకోవచ్చు.ఎందుకంటే… ఇటీవల వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ కు అయిన ఖర్చు 100 కోట్లు.ఇక సర్కారు వారి పాటకు 65 కోట్లు… మరి ఆర్ ఆర్ ఆర్ కు అన్ని కోట్లు అంటే కామెడీ కదా?

అయితే సినిమాకు ఇలాంటి హైప్ ఇవ్వడం రాజమౌళికి కొత్త ఏమీ కాదు.అయితే ఇప్పుడు ఓ టి టి కి డబ్బులు అన్న మాట విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.అయితే కొందరు ఇప్పటికే దీనిపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది.అదేంటి… ఓటిటి లకు ఎలాగూ నెలకు లేదా సంవత్సరానికి ప్రీమియం కడుతున్నాము కదా… మళ్లీ ఈ ఒక్క సినిమాకే అదనంగా డబ్బులు కట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ సినిమాను జీ5 ఒ టీ టీ లో చూడాలంటే.
మొత్తం 699 రూపాయలు చెల్లించాలి.అయితే ఇలా చేయడం ఇది మొదటి సారి కాదని మాత్రం తెలుస్తోంది.
కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ట్ హీరో నటించిన రాధే మూవీ ఎన్నో అంచనాలతో విడుదలయినా ప్లాప్ అయింది.అందుకే ఒ టి టి లో ఒక్కసారి చూడడానికి ఇంత డబ్బులు అని పెట్టారు.
అలా రాధే సినిమా నిర్మాతలకు కొంత వరకు అయినా డబ్బు వచ్చింది.కానీ ఇక్కడ కూడా సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇండియన్ టీవీ మరియు ఒ టి టి లలో ఏది చూడాలన్నా నెల రుసుము కడుతున్నారు.ఇప్పుడు కేవలం జీ 5 లో ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతోంది.అందుకు జీ5 ఆక్టివేషన్ కోసం 599 మరియు కేవలం ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూడడం కోసం 100 రూపాయలు అదనంగా చెల్లించాలట.అయితే కేవలం ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూడడానికి 699 చెల్లించడం అవసరమా ? అంటూ అడుగుతున్నారు.అయితే ఈ జీ 5 లో మరొక ఇంటరెస్టింగ్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు అంతదానికి 699 కట్టడం అవసరమా ? అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.అంతే కాకుండా ఈ సినిమాను ఒ టీ టీ ప్లాట్ ఫామ్ లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా ఉండదు.
దీనిని ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి.చాలా వరకు ఒ టి టి ని ఫాలో అవుతున్న వారు మొబైల్ నే వాడుతున్నారు.అందులో క్వాలిటీ అంతగా ఉండదు అన్న విషయం తెలిసిందే.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందరూ మిస్ అవుతారు.
మొత్తానికి ఓ టీ టి లో ఈ సినిమా చూడడం అంత సంతృప్తిని ఇవ్వదు.మరి ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది చూడాలి.